AP High Court: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court)లో బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court)లో బిగ్ షాక్ తగిలింది. తనపై తిరుపతి (Tirupati) పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసు (POCSO Case)లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా.. గతేడాది నవంబర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎర్రావారిపాలెం (Yerravaripalem) పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా బాలికపై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని రుజువు అవ్వడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత చెవిరెడ్డి అటువంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ అంతకు ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ చెవిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లుగా ధర్మాసనం తీర్పును వెలువరించింది.