Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

ఏపీ కాంగ్రెస్ సమన్వయకర్తల రెండో జాబితా విడుదల అయింది..

Update: 2024-11-10 11:53 GMT
Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కాంగ్రెస్(Congress) పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(Ap Pcc Chief Ys Sharmila) అహర్నిశలు శ్రమిస్తున్నారు. చిన్న తప్పు దొరికినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అటు సోదరుడు వైఎస్ జగన్(YS Jagan) తప్పిదాలను సైతం వదిలిపెట్టడంలేదు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక నుంచి పార్టీ క్రమాల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి చెందిన పలు పదవులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 50 నియోజకవర్గాలకు సమన్వయకర్తల తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా మరో జాబితానూ షర్మిల విడుదల చేశారు. కుప్పం, తిరుపతి, కర్నూలుతో పాటు మరో 47 నియోజకవర్గాలకు సమన్వయ కార్యకర్తలను నియమించింది. ఈ మేరకు లిస్టు విడుదల చేశారు. పార్టీ కోసం పని చేస్తున్న నేతలు, కార్యకర్తలకు ఆమె ఈ ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమన్వయకర్తలు(Coordinators) పార్టీ బలోపేతం కోసం పని చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News