పొటాటో దగ్గర దొరికిపోయిన సీఎం జగన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శల పాలయ్యారు....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శల పాలయ్యారు. నోరు తిరగని పదాలతో చాలాసార్లు సీఎం జగన్ ఇబ్బందులు పడ్డారు. తప్పులు మాట్లాడుతూ ఎలాగోకలాగా ఆ సభలను నెట్టుకొచ్చారు. దీంతో సీఎం జగన్‌కు తెలుగు సరిగారాదనే ముద్ర పడింది. అయితే తాజాగా ఆయన మరోసారి దొరికిపోయారు. అది కూడా పొటాటో పట్టించింది. పొటాటో అంటే ‘ఉల్లిగడ్డ’ అని చెప్పి.. ఆ తర్వాత బంగాళదుంప అని నవ్వూతూ కవర్ చేశారు. కానీ నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం వదలడంలేదు. ముందు ఉల్లిగడ్డకు, పొటాటోకు తేడా తెలుసుకోవాలని, అలాగే తెలుగు సరిగా మాట్లాడటం నేర్చుకోవాలని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇవాళ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అయితే బాధితులతో మాట్లాడే సమయంలో పొటాటో అంశం వచ్చింది. పొటాటో గురించి చెబుతూ ఒక కేజీ ‘ఉల్లిగడ్డ’ అని అన్నారు. వెంటనే అక్కడున్న వారు బంగాళాదుంప అని చెప్పడంతో నవ్వుకుంటూ ఐయామ్ సారీ అంటూ కవర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సీఎం జగన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలైతే బంగాళాదుంపకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం ఉండటం ఖర్మ అంటూ విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు తెలుగు భాష సరిగా రాదని.. కూరగాయలు తెలియవని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియం పేరుతో రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న బైజూస్‌కు కోట్లు కట్టబెట్టేందుకే ఇంగ్లీష్ మీడియాన్ని సీఎం జగన్ తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లిగడ్డని 'Potato' అంటారు అంట .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి !? #WhyAPHatesJagan pic.twitter.com/VBjs24r2a3
— iTDP Official (@iTDP_Official) December 8, 2023
మరోవైపు జగన్ తప్పులను కవర్ చేసేందుకు వైసీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. పొటాటోను రాయలసీమలో ‘ఉల్లగడ్డ’ అని పిలుస్తారని, ఆ విషయం రాయలసీమ వాసినని చెప్పుకునే చంద్రబాబుకు తెలియకపోవడం సీమ యాస, భాష పట్ల ఏమాత్రం జ్ఙానం ఉందో అర్ధమవుతోందని ప్రతివిమర్శలు చేస్తున్నారు.
ఇందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘‘సీమలో అయితే "ఉల్ల గడ్డ" అనే అంటారు. మీ వాడికి అది తెలియదు కాబట్టే "ఉల్లి గడ్డ" అంటాడు. మళ్ళీ రాయలసీమ ముద్దు బిడ్డ అని డబ్బులిచ్చి డప్పు. మీ వాడికి సీమలో పలికే ఉల్లగడ్డ తెలియదు, ఆంధ్రాలో పలికే బంగాళదుంప తెలియదు. నీకు అసలు ఏ యాసా తెలియదు. అందుకే కాస్తో ఇస్కిస్తో లాంటి కొత్త పదాలు కనిపెట్టాడు. గడ్డ ఏదో, దుంప ఏదో తెలియకే కదా, ప్రజల నోట్లో మట్టి గడ్డలు కొట్టాడు. దమ్ము గురించి, పరదాలు కప్పుకుని తిరిగే మీరే చెప్పాలి’ అని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం జగన్ చేసిన పొటాటో కామెంట్స్‌పై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య మాటల వార్‌కు తెరతీశాయి. మరి ఈ వార్ ఎప్పటికి ఆగుతుందో చూడాలి.
సీమలో అయితే "ఉల్ల గడ్డ" అనే అంటారు. మీ వాడికి అది తెలియదు కాబట్టే "ఉల్లి గడ్డ" అంటాడు. మళ్ళీ రాయలసీమ ముద్దు బిడ్డ అని డబ్బులిచ్చి డప్పు.
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023
మీ వాడికి సీమలో పలికే ఉల్లగడ్డ తెలియదు, ఆంధ్రాలో పలికే బంగాళదుంప తెలియదు. నీకు అసలు ఏ యాసా తెలియదు. అందుకే కాస్తో ఇస్కిస్తో లాంటి కొత్త పదాలు… https://t.co/vv2njwCAer