AP: డిప్యూటీ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన CM చంద్రబాబు & నారా లోకేశ్

నేడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2024-09-02 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఏపీ డిప్యూటీ సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ బాబు పవన్ కల్యాణ్ కు విష్ చేయగా.. కుమారుడు నారా లోకేశ్.. ‘రియల్ హీరో అన్నకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే పవన్ అన్న’ అంటూ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 


Similar News