ఈ నెల 10వ తేదీన AP Cabinet భేటీ.. కీలక పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు కేబినెట్(Cabinet) సమావేశం నిర్వహించింది.
దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు కేబినెట్(Cabinet) సమావేశం నిర్వహించింది. ఇందులో మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి పథకాలకు ఆమోదం తెలపడంతో పాటు.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేబినెట్ మీటింగ్ లో ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీ తో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే చెత్త పన్ను రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రి వర్గంలో చర్చించనున్నారు. వీటితో పాటుగా అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.