63 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సమీపంలోని అడవుల్లో 63 ఎర్రచందనం దుంగలతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి అడవి జంతువులు వేటాడే ఒక నాటు తుపాకీని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-02 12:48 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సమీపంలోని అడవుల్లో 63 ఎర్రచందనం దుంగలతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి అడవి జంతువులు వేటాడే ఒక నాటు తుపాకీని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ ఐ ఎం.చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ సోమవారం రాత్రి కేవీబీ పురం మండలం పచారు మాను వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు.

అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీరిని హెచ్చరించి చుట్టుముట్టి ఇద్దరిని పట్టుకున్నారు. వారిని కేవీబీ పురం మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరి వద్ద అడవి జంతువులను వేటాడే నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును ఎస్ ఐ సీహెచ్ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో స్థానిక అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Similar News