రెండు అంతరాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాలు అరెస్ట్

రెండు అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-10-02 15:08 GMT

దిశ, కార్వాన్ : రెండు అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సౌత్ అండ్ వెస్ట్ జోన్ పరిధిలో చోఉ చేసుకుంది. బుధవారం మెహిదీపట్నంలోని కార్యాలయంలో సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ వివరాలను వెల్లడించారు. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా (32) ఆర్టిఫిషియల్ జువెలరీ వ్యాపారం చేస్తున్నాడు.

    ముంబాయికి చెందిన అహమద్ షేక్ (24) ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ముంబై కి చెందిన ఇర్ఫాన్ రాజు షేక్ (20) హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ బృందాలు, హబీబ్ నగర్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా మల్లేపల్లి రవీంద్ర భారతి స్కూల్ సమీపంలో గత నెల 30వ తేదీన సాయంత్రం ఈ ముగ్గురి వద్ద 144:72 గ్రాముల ఆర్గానిక్ గంజాయి, హ్యాష్ ఆయిల్ తోపాటు ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఆసిఫ్ నగర్ లో మరో కేసు...

ఒడిస్సా రాష్ట్రం మల్కన్ గిరి ప్రాంతానికి చెందిన హంటాల గోవర్ధన్ (32) అనే రైతు ఏడవ తరగతి వరకు చదివాడు. ఒరిస్సా కోరాపుట్ జిల్లాకు చెందిన హాష్ ఆయిల్ ప్రధాన సరఫరాదారుడు మనోజ్ ను గత కొన్ని రోజుల క్రితం కలిసి పరిచయం పెంచుకొని స్నేహం చేశాడు. కాగా హైదరాబాద్​లో కస్టమర్లకు గంజాయి హాష్ ఆయిల్ ను సరఫరా చేశాడు. అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా వ్యాపారం కొనసాగించాడు. ఈ క్రమంలో మనోజ్ ఐదు రోజుల క్రితం నగరంలోని ఓ కస్టమర్ కు రెండు కిలోల హాష్​ ఆయిల్ డెలివరీ చేయమని గోవర్ధన్ ను ఆదేశించాడు.

     ఈ మేరకు హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్ సాయిబాబా దేవాలయాలకు చేరుకున్న గోవర్ధన్ వాహన తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం ఆసిఫ్ నగర్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకొని తనిఖీ చేయగా రెండు కిలోల హాష్​ ఆయిల్ లభించింది. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. పోలీసులు గోవర్ధన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రెండు కేసులను ఛేదించిన పోలీసులను డీసీపీ చంద్రమోహన్ అభినందించారు. 

Tags:    

Similar News