TG News: మాజీ మంత్రి కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి కేటీఆర్‌పై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Update: 2024-10-02 17:01 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్‌(Former Minister Ktr)పై హైదరాబాద్ వ‌నస్థలిపురం పోలీస్‌స్టేష‌న్‌లో టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి(TPCC Media & Communications Chairman Sama Rammohan Reddy) ఫిర్యాదు చేశారు. మూసీ నది ప్రక్షాళ‌న(Musi River Purging) విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై కేటీఆర్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని... అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ప్రణాళిక చేశారని సీఎంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్‌పైనా త‌ప్పుడు ఆరోప‌ణలు చేశారని, కేటీఆర్‌పై త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు.

కాగా మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు(HYDRA Officials) తొలగిస్తున్న విషయం తెలిసిందే. మూసీ వెంట సర్వే మార్కులు వేసి మరి కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(Double Bedroom Houses)ను కేటాయించిన అనంతరం చర్యలు చేపడుతున్నారు. కానీ కొంత మంది బాధితులు మాత్రం అక్కడి నుంచి కదలమంటున్నారు. బీఆర్ఎస్(BRS) కార్యాలయంలో ఆ పార్టీ మాజీ మంత్రులను కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను మూసీ బాధితులు కలిశారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్తున్న కేటీఆర్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ పరిణామంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శలు కురిపించారు. దీంతో టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ సీరియస్ అయింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


Similar News