మంత్రి కొండా సురేఖపై అక్కినేని అమల ఆగ్రహం

మంత్రి కొండా(Konda Surekha) సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీద చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Update: 2024-10-02 17:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా(Konda Surekha) సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీద చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్ పై చేసిన ఆరోపణల్లో సురేఖ అక్కినేని కుటుంబ ఆంతరంగిక వ్యవహారాలను ప్రస్తావించడం పట్ల ప్రముఖులు మండిపడుతున్నారు. మీ రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అక్కినేని కుటుంబపు మాజీ కోడలు నటి సమంత స్పందిస్తూ.. తనని రాజకీయాల్లోకి లాగవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున భార్య అమల స్పందిస్తూ.. ఒక మంత్రి అయి ఉండి అందునా మహిళ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. "ఒక మహిళా మంత్రి తన స్వార్థ రాజకీయాల కోసం అబద్దపు ఆరోపణలు చేయడం దారుణం. రాహుల్ గాంధీ గారూ.. నేతలు ఇంతలా దిగజారి ప్రవరిస్తే మన దేశం ఏమవుతుంది? దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. సదరు మంత్రి నా కుటుంబానికి తక్షణమే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలు ఉపసహరించుకునేలా చర్యలు తీసుకోండి." అంటూ అమల రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ట్యాగ్ చేశారు. కాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్, వైసీపీ నాయకురాలు రోజా, నటుడు నాగ చైతన్య మండిపడ్డారు. 


Similar News