‘ఆరెక్స్ బెనిఫిట్స్’ ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాకు చెందిన ఆరెక్స్ బెనిఫిట్స్ సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

Update: 2024-10-02 17:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికాకు చెందిన ఆరెక్స్ బెనిఫిట్స్ సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం ఆ సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ఆరెక్స్ బెనిఫిట్స్ ఈ సామర్థ్యం ఏర్పాటు ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, రాష్ట్రంలోని ప్రతిభావంతులకు మంచి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఫార్మసీలకు లాభాలు పెంచుకోవడంలో తోడ్పడుతుందని, హైదరాబాద్ నైపుణ్య కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత అపారంగా ఉన్నందున బహుళ జాతి సంస్థలకు చుక్కానిగా మారిందని వెల్లడించారు. ఆధునిక సాంకేతిక, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో డిజిటల్ పరివర్తన అనివార్యంగా మారిందన్నారు.


Similar News