ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. అరగంటపాటు గాలిలో చక్కర్లు
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది...
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు(Vijayawada Gannavaram Airport)లో ఇండిగో విమానాని(Indigo Airlines)కి ప్రమాదం తప్పింది. వర్షం(Rain) కారణంగా గాలిలోనే ఫ్లైట్ అరగంట పాటు చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. విమానం షిర్డి (Shirdi) నుంచి గన్నవరం వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. రన్ వేపై ల్యాండింగ్ కనిపించకపోవడంతో ఫైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు. చివరకు సురక్షితంగా విమానాన్ని ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు(Passengers) ఊపిరిపీల్చుకున్నారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి పలు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. పలు ఇండిగో సర్వీసులను సైతం ప్రారంభించారు. దీంతో విమాన రాకపోకలు సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి అమరావతికి ప్రతి రోజు ఒక ఇండిగో సర్వీసు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో షిర్డీ నుంచి వచ్చిన ఇండిగో విమాన సర్వీసు గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాలంలోనూ గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో రెండు విమానాల్లో కుదుపు వచ్చాయని గుర్తు చేశారు.