Durgamma Templa: రేపటి నుంచి పది రోజులు ప‌ది అవతారాల్లో అమ్మవారి దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు సిద్ధమైంది..

Update: 2024-10-02 14:05 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri) దసరా ఉత్సవాల(Dussehra Festivals)కు సిద్ధమైంది. రేపటి నుంచి పది రోజుల పాటు దుర్గమ్మ ఆలయం(Durgamma temple)లో ఉత్సవాలు వైభంగా జరగనున్నాయి. ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది భక్తులు(Devotees) వస్తారని ఆలయం అధికారులు అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా ఆలయ అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాయంలోకి భక్తులను అనుమతించరు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పది అవతారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది లేజర్‌షో ద్వారా కృష్ణమ్మకు హరతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 9 ఉదయం గంటలకు చండీయాగం(Chandi Yagam) నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన తెప్పోత్సవంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తుల కోసం విజయవాడలోని పలు ప్రాంతాల్లో రూ. 300, 500 దర్శన టికెట్లను విక్రయించనున్నారు. కొండ‌పై వినాయక ఆలయం (Vinayaka Temple) వద్ద సమాచార కేంద్రా(Information center)న్ని ఏర్పాటు చేశారు. మ‌రింత‌ సమాచారం కోసం ద‌స‌రా మహోత్సవం 2024 యాప్‌‌(Dussehra Mahotsavam 2024 App)ను దుర్గగుడి అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చామని దుర్గ గుడి ఈఓ రామారావు పేర్కొన్నారు. 


Similar News