పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి వెంటనే పెన్షన్ మంజూరు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన మహిళకు వెంటనే వితంతువు పెన్షన్(Widow Pension) ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన మహిళకు వెంటనే వితంతువు పెన్షన్(Widow Pension) ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్తగా 5,402 మంది వితంతువులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) పెన్షన్(Pension) మంజూరు చేసింది. కాగా గతంలో 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు(new pensions) చేసేవారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ మంజూరు విధానంలో మార్పులు చేసింది. అలాగే గడిచిన మూడు నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని.. 50 వేల మందికి సైతం ఇవాళ పెన్షన్ పంపిణీ(Distribution of pension) చేయనున్నారు. దీంతో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో.. వారంతా .. ఈ రోజు రెండు, మూడు నెలల మొత్తం పెన్షన్ ఒకేసారి అందుకోనున్నారు. కాగా కొంతమంది లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పల్నాడు జిల్లాల్లో పెన్షన్ అందించనున్నాడు.