AP Professional Forum: 2000 నోట్ల రద్దు అపరిపక్వ చర్య
భారతీయ రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 వేల నోటు జారీ నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది...
దిశ, ఏపీ బ్యూరో: భారతీయ రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 వేల నోటు జారీ నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2000 రద్దుపై ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నేత ప్రముఖ చార్టెడ్ ఎకౌంటెంట్ నేతి మహేశ్వర రావు శుక్రవారం ఓ ప్రకటనలో తన అభిప్రాయాలను వెల్లడించారు. నల్లధనం వెలికితీత కోసమే 2000 నోట్ల రద్దు అంటే ఇంకో అపరిపక్వ చర్య అనుకోవచ్చన్నారు. నోట్ల రద్దు మూలాన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, తీవ్రవాదం తగ్గింది లాంటి బీజేపీ తాలూకా వాట్సాప్ యూనివర్సిటీ కోసం ఉపయోగపడుతుందేమో గాని చిన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పడతారన్నారు. అలాగే ఆర్థిక మందగమనం చూడాలవలసిన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు
2016 నోట్ల రద్దుతో ఎంత శాతం నల్లదాన్ని వెలిక్కి తీశారని ప్రశ్నించారు. నల్లధనం నగదు రూపంలో ఉందా లేదా బినామీ ఆస్తుల రూపంలో ఉందా కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. నల్లధనం బినామీ ఆస్తుల్లో ఉంది 2016లో నోట్ల రద్దు ద్వారా ఖర్చు పెట్టినది ఎంత ఫలిత మొచ్చిందో చెప్పగలిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా అని హిందీన్ బర్గ్ నివేదికలో నల్లధనాన్ని దేశంలోకి స్టాక్ మార్కెట్ ద్వారా తీసుకుని వస్తున్నారని నివేదిక ఇస్తే ఆ నివేదిక మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా అంటూ నిలదీశారు. నల్లధనం నగదు రూపంలో ఉన్నది స్వల్పమే అని మొత్తం నల్లధనం బినామీ ఆస్తుల రూపంలో ఉన్నదనటానికి 2016 నోట్ల రద్దుతో వెలికి తీసిన శాతం చూస్తే ఒక్క శాతం లోపే అని అర్థం అవుతుందని మహేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: