అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఎస్సై తీరుతో మహిళ ఆత్మహత్యాయత్నం..!
అన్నమయ్య జిల్లా దూళ్లహరిజనవాడలో దారుణం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా దూళ్లహరిజనవాడలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మహిళపై పెద్ద రెడ్డయ్య అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాత్ రూమ్‌లో స్నానానికి వెళ్లిన సమయంలో ఆమెపై నిందితుడు అఘాయిత్యానికి ప్రయత్నం చేశారు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కానీ బాధిత మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే తన ఆత్మహత్యానికి వీరబల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఎస్సైనే కారణమని బాధితురాలు ఆరోపించారు. పెద్ద రెడ్డయ్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తన పట్ల ఎస్సై అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై తీరుతోనే మహిళ మనస్థాపం చెందినట్లు బాధితురాలి బంధువులు అంటున్నారు. అయితే బాధితురాలిపై అత్యాచారయత్నం, ఆత్మహత్యాయత్నం ఘటనలపై ఇప్పటివరకూ పోలీసులు కేసులు నమోదు చేయలేదని చెబుతున్నారు.