ఇద్దరు మగ టీచర్ల వింత ప్రేమ కథ.. ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత ఊహించని ట్విస్ట్..!

బెజవాడలో వింత ప్రేమ కథ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మగటీచర్లు గాఢంగా ప్రేమించుకున్నారు.

Update: 2023-08-16 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెజవాడలో వింత ప్రేమ కథ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మగటీచర్లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిపై మరొకరికి వీపరీతంగా ప్రేమ పెరగడంతో ప్రేమికుడి కోసం మరో వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారాడు. కానీ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రియుడు మోసం చేయడంతో చివరకు ఈ ఇద్దరి మగటీచర్ల లవ్ స్టోరీ బెడిసికొట్టింది. దీంతో ప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్‌గా మారిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వింత ప్రేమ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల ప్రకారం.. బెజవాడకు చెందిన పవన్, నాగేశ్వర్ ఇద్దరు టీచర్లు. బీఈడీ చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పవన్ ప్రియుడు నాగేశ్వర్ రావు కోసం లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని భ్రమరాంభగా మారాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్న పవన్ ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేసుకుని భ్రమరాంభగా మారిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు నాగేశ్వర్ రావు నిరాకరించాడు. దీంతో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకుని మోసపోయానని గ్రహించిన భ్రమరాంభ (పవన్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న భ్రమరాంభ ప్రియుడు నాగేశ్వర్ రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నాగేశ్వర్ రావు కోసం పోలీసులు గాలిస్తు్న్నారు. 

Tags:    

Similar News