మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు కేజీ ఎంతంటే?

ప్రజలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆదివారం మాంసం తినకుండా ఉండలేరు.

Update: 2023-05-14 04:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆదివారం మాంసం తినకుండా ఉండలేరు. ఎండాకాలం కావడంతో కోడి మాంసం తక్కువ ఉత్పత్తి అవుతుండటంతో ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్య ప్రజలకు కోడి మాంసం ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో చికెన్ ప్రియులు ఈ ధరలు చూసి షాక్ అవుతున్నారు. ఏపీలో బాయిలర్ కోడి మాంసం కిలో ధర రూ. 280 నుంచి రూ. 285 ఉంది. అలాగే ఫారం కోడి కిలో మాంసం రూ. 200 పైగా పలుకుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో కూడా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more:

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తెలుసా!

Tags:    

Similar News