Visakha Dairy: పెరిగిన అనుమానాలు.. అసెంబ్లీ సభా సంఘం కీలక నిర్ణయం
విశాఖ డెయిరీని అసెంబ్లీ సభా సంఘం పరిశీలించింది...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ డెయిరీ(Visakha Dairy)ని అసెంబ్లీ సభా సంఘం(Assembly Sahba Sangam) పరిశీలించింది. డెయిరీలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు అసెంబ్లీ సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్నప్రాత్రుడు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘం సభ్యులు సోమవారం విశాఖ డెయిరీకి వెళ్లింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ(MLA Jyotula Nehru) ఆధ్వర్యంలో పరిశీలించారు. కానీ పరిశీలన సమయంలో డెయిరీ చైర్మన్ హాజరుకాలేదు. ఎండీ మాత్రమే హాజరయ్యారు. దీంతో డెయిరీలో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ సభా సంఘం సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెయిరీలో పరిశీలన తర్వాత అనుమానాలు పెరిగడంతో నిపుణుల కమిటీ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే డెయిరీపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ డైయిరీ పరిధిలోని 4 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని, పాడి రైతులకు నష్టం జరకుండా చూస్తామని తెలిపారు. త్వరలోనే తమ కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామని చెప్పారు. డెయిరీని మరోసారి సైతం పరిశీలస్తామని అసెంబ్లీ సభా సంఘం సభ్యులు స్పష్టం చేశారు.