బ్రేకింగ్: యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. నోట్లో పురుగుల మందు..

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. యువతి తలపై కర్రతో దాడి చేసి నోట్లో పురుగుల మందు పోయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యువతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కు తరలించారు. అయితే యువతిపై దాడి చేసిన వారు ఎవరు, కారణాలు ఏంటీ అన్న కోణంలో పోలీసులు […]

Update: 2021-08-09 05:51 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. యువతి తలపై కర్రతో దాడి చేసి నోట్లో పురుగుల మందు పోయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యువతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కు తరలించారు. అయితే యువతిపై దాడి చేసిన వారు ఎవరు, కారణాలు ఏంటీ అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags:    

Similar News