గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్ట్ చేసిన విద్యుత్ శాఖ
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జోన్ ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రజలందరూ విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జోన్ ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రజలందరూ విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ వైర్లు తెగినా, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్యలు ఏర్పడినా కంట్రోల్ రూమ్, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004250028, 1912కి తెలియజేయాలని సీఎండీని కోరారు.