తెలంగాణకు త్వరలో ఏఐసీసీ బృందం.. అసలు విషయం చెప్పిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ఏఐసీసీ వార్‌రూంలో హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలు, పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్రానికి ప్రతినిధులు వస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపరిపాలన చేయడం లేదని, సమస్యలన్నీ పక్కదోవపట్టిస్తుందని, ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని సీనియర్లందరినీ కలుపుకుని వెళ్లి పోరాటం చేస్తామన్నారు. సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ రేపట్నుంచే ఉద్యమం చేస్తామని, బీజేపీ, […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ఏఐసీసీ వార్‌రూంలో హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలు, పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్రానికి ప్రతినిధులు వస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపరిపాలన చేయడం లేదని, సమస్యలన్నీ పక్కదోవపట్టిస్తుందని, ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని సీనియర్లందరినీ కలుపుకుని వెళ్లి పోరాటం చేస్తామన్నారు.
సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ రేపట్నుంచే ఉద్యమం చేస్తామని, బీజేపీ, టీఆర్‌ఎస్ ద్రోహంపై నిలదీస్తామన్నారు. సోనియాగాంధీ ఆశించినట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తామని, కేంద్ర నాయకత్వం సూచనలతో ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హుజురాబాద్ బై ఎలక్షన్ ఫలితాలపై సమీక్షించామని, ఇక నుంచి పార్టీ సమన్వయంతో, ఐక్యతతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని, ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. 2023లో గెలుపుదిశగా ఉంటామని, కాంగ్రెస్‌పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు.
రాష్ట్రంలోని నేతలందతా కలిసికట్టుగా వచ్చే 2023లో అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఏఐసీసీ నేతలతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు నాటకాలాడుతున్నాయని, ఈ నాటకాలను ప్రతి గ్రామంలోకి తీసుకుపోతామని భట్టి చెప్పారు.