నిశ్చితార్ధం ఒకరితో, పెళ్లి ఇంకొకరితో..
దిశ, జమ్మికుంట : ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చితార్థం అయ్యాక ఓ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి తనకు న్యాయం చేయాలని యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది. యువతి కథనం ప్రకారం.. ఇల్లంతకుంట మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన రామ్ చందన అనే యువతికి జమ్మికుంట పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఉండే శనిగరపు మధు […]
దిశ, జమ్మికుంట : ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చితార్థం అయ్యాక ఓ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి తనకు న్యాయం చేయాలని యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది. యువతి కథనం ప్రకారం.. ఇల్లంతకుంట మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన రామ్ చందన అనే యువతికి జమ్మికుంట పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఉండే శనిగరపు మధు అనే యువకుడితో గత కొంతకాలం కిందట పెద్దమనుషుల సమక్షంలో వివాహం నిశ్చయమైంది.
అయితే, కట్నకానుకల కింద రూ.1.5 లక్షలు, ద్విచక్ర వాహనం ఇచ్చేలా పెద్దలు నిశ్చయించారు. బాధితురాలు తనకున్న వ్యవసాయ భూమి, రూ.లక్ష నగదును మధు కుటుంబ సభ్యులకు ముందే అందజేశారు. పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో బాధితురాలు తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే మధు వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న చందన మధు యవకుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అబ్బాయి కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో సదరు యువతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధు తండ్రిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి వివరాలను రాబట్టే ప్రయత్నంలో ఉండగా, మధు పరారీలో ఉన్నట్లు తేలింది.