మమ్మల్ని కాపాడండి .. ఉగ్రవాదానికి, యుద్ధానికి మధ్య నలుగుతున్నాం..!
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికత్వానికి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఊరు, సొంత దేశాన్ని వదిలేసి కట్టుబట్టలతో విదేశాలకు వెళ్ళి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కాబూల్ ఎయిర్ పోర్టులో పడిగాపులు గాస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దళాలు ఆఫ్ఘన్ పౌరులకు సాయం చేస్తున్నా.. లక్షల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు ప్రపంచ దేశాల శరణు కోరుతున్నారు. భద్రతాదళాలు సాయం అందిస్తున్నా చాలా మంది పౌరులు బిక్కుబిక్కుమంటూ ఎయిర్ పోర్టు బయట గడుపుతున్నారు. తమకు ఏమైనా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికత్వానికి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఊరు, సొంత దేశాన్ని వదిలేసి కట్టుబట్టలతో విదేశాలకు వెళ్ళి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కాబూల్ ఎయిర్ పోర్టులో పడిగాపులు గాస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దళాలు ఆఫ్ఘన్ పౌరులకు సాయం చేస్తున్నా.. లక్షల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు ప్రపంచ దేశాల శరణు కోరుతున్నారు. భద్రతాదళాలు సాయం అందిస్తున్నా చాలా మంది పౌరులు బిక్కుబిక్కుమంటూ ఎయిర్ పోర్టు బయట గడుపుతున్నారు.
తమకు ఏమైనా పర్లేదు కానీ తమ పిల్లలను అయినా తాలిబన్ల నుంచి రక్షించాలని కోరుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టు బయట ఆ దేశ పౌరుల ఆర్తనాదాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం మనదేశంలోని ఆఫ్ఘన్ పౌరులు ఢిల్లీలోని ‘యునైడెట్ నేషన్స్ ఫర్ ఫోరమ్’ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు శరణార్థులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి, యుద్ధానికి మధ్య ఆఫ్ఘన్ ప్రజలు నలిగిపోతున్నారని, చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఆశ్రయం కల్పించాలని వారు ప్రపంచ దేశాలను కోరుతున్నారు.