అడ్వకేట్ వామన్రావు మర్డర్ కేసు.. జైల్లో నిందితుడు ఆత్మహత్యాయత్నం!

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. అపస్మారక స్థితికి చేరిన సదరు నిందితునికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా […]

Update: 2021-11-06 10:55 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. అపస్మారక స్థితికి చేరిన సదరు నిందితునికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

ప్రధాన నిందితులు కుంట శ్రీను, అక్కపాక కుమార్, చిరంజీవిలతో పాటు హత్యలకు సహకరించిన తుల్సేగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టు శ్రీను, ఊదరి లచ్చయ్య, వెల్ది వసంత రావ్, కాపు అనిల్ జైల్లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో వీరిని వర్చువల్ విధానంలో కరీంనగర్ కోర్టు విచారణ చేపడుతోంది. నిందితుల్లో ఒకరు రెండ్రోజుల క్రితం జైలు గదిలోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడానే ఉన్నట్లు తెలిసింది.

Tags:    

Similar News