మిడతల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
దిశ, ఆదిలాబాద్: మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిడతల దండు అదుపునకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో మిడతలు ఉన్నాయని.. అవి ఏ సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివిజన్‌లలో ఒక ఫైర్ ఇంజన్, 5 ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మిడతలపై పిచికారీ చేసే […]
దిశ, ఆదిలాబాద్: మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిడతల దండు అదుపునకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో మిడతలు ఉన్నాయని.. అవి ఏ సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివిజన్‌లలో ఒక ఫైర్ ఇంజన్, 5 ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మిడతలపై పిచికారీ చేసే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, ఏడిఏలు కోటేశ్వరరావు, వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.