ప్రకృతి అందాలను మైమరిపించే ప్రదేశాలు..
దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో జాతీయ పెద్దపులి దినోత్సవ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ అదనపు పీసీసీఎఫ్ సిన్హా హాజరై సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో అడవుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అడవులు బాగుంటేనే వన్యప్రాణుల జీవనం మరియు మనుగడ సాఫీగా కొనసాగుతుందని […]
దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో జాతీయ పెద్దపులి దినోత్సవ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ అదనపు పీసీసీఎఫ్ సిన్హా హాజరై సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో అడవుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అడవులు బాగుంటేనే వన్యప్రాణుల జీవనం మరియు మనుగడ సాఫీగా కొనసాగుతుందని వాటి సంరక్షణ కోసం, అడవుల అభివృద్ధి వన్య ప్రాణులతో పాటు పర్యావరణ సమతుల్యత ఉందని గుర్తు చేశారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవుల్లో గల సహజసిద్ధ నీటి వనరులు మరింతగా అభివృద్ధి చేయాలని, ప్రకృతి అందాలను మైమరిపించే ప్రదేశాలు ఈ అడవుల్లో కోకొల్లలుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల తగిన సిబ్బందిని నియమించామని, వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా స్థానిక ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం కురుస్తున్నప్పటికీ నూతనంగా ఎంపికైన ఫారెస్ట్ బీట్ అధికారులకు నడక పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు మన్ననూరులో అన్ని స్థాయి అధికారులకు ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇప్పటివరకూ చేపడుతున్న చర్యలు క్షేత్రస్థాయిలో అధికారుల అవగాహనపై చిన్నపాటి పరీక్షను నిర్వహించారు.