‘ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి’

దిశ ,ఆదిలాబాద్ : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో నిరుపేద రోగుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మనోహర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ ఛార్జి, అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వైద్య ఆరోగ్య […]

Update: 2021-05-24 08:58 GMT

దిశ ,ఆదిలాబాద్ : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో నిరుపేద రోగుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మనోహర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ ఛార్జి, అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ స్పందించి ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేద రోగుల పక్షాన ఉంటూ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ ,నగేష్, మల్లేష్, రాహుల్ ,సంతోష్, రాజు యాదవ్, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News