పనిచేస్తున్న వారిమీదికి దూసుకెళ్లిన లారీ…
దిశ,మానకొండూరు: రోడ్డుపై పనులు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన సంఘటన రేణుకుంట టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద హైడ్రాలిక్ బండితో ఇద్దరు వ్యక్తులు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న లారీ ఒక్కసారిగా పనులు చేస్తున్న హైడ్రాలిక్ బండిని ఢీకొట్టంది. దీంతో హైడ్రాలిక్ బండిలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఆ ఇద్దరిని వెంటనే కరీంనగర్ […]
దిశ,మానకొండూరు: రోడ్డుపై పనులు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన సంఘటన రేణుకుంట టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద హైడ్రాలిక్ బండితో ఇద్దరు వ్యక్తులు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న లారీ ఒక్కసారిగా పనులు చేస్తున్న హైడ్రాలిక్ బండిని ఢీకొట్టంది. దీంతో హైడ్రాలిక్ బండిలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఆ ఇద్దరిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.