అర్థరాత్రి వరకు ఏసీబీ సోదాలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అన్ని జిల్లాలో ఏసీబీ అధికారులు అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్, సబిరిజిస్ట్రార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో జరిగిన దాడుల్లో పలు కీలక పత్రాలు, అనధికార నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లెక్కల్లోకి రాని రూ.9.55లక్షల నగదు, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రూ.3.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రైవేట్ వ్యక్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు రిపోర్టు ఫైల్ […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని అన్ని జిల్లాలో ఏసీబీ అధికారులు అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్, సబిరిజిస్ట్రార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో జరిగిన దాడుల్లో పలు కీలక పత్రాలు, అనధికార నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లెక్కల్లోకి రాని రూ.9.55లక్షల నగదు, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రూ.3.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రైవేట్ వ్యక్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు రిపోర్టు ఫైల్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఏసీబీ తెలిపింది.