ఇల్లంతకుంటలో గులాబీ VS కమలం.. పరస్పరం రాళ్ల దాడి
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట మండలంలో జరిపిన పర్యటన అంతా నిరసనల నడుమే సాగింది. బీజేపీ నాయకులు టవర్ ఎక్కి నిరసన తెలపగా, కాంగ్రెస్ నాయకులు మరోవైపున ఆందోళన చేశారు. ఏబీవీపీ నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో లాఠీఛార్జీ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఏబీవీపీ నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. ఠాణాలో రణరంగం.. కేటీఆర్ టూర్ సందర్భంగా నిరసనలు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్, ఏబీవీపీ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొద్ది […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట మండలంలో జరిపిన పర్యటన అంతా నిరసనల నడుమే సాగింది. బీజేపీ నాయకులు టవర్ ఎక్కి నిరసన తెలపగా, కాంగ్రెస్ నాయకులు మరోవైపున ఆందోళన చేశారు. ఏబీవీపీ నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో లాఠీఛార్జీ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఏబీవీపీ నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు.
ఠాణాలో రణరంగం..
కేటీఆర్ టూర్ సందర్భంగా నిరసనలు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్, ఏబీవీపీ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొద్ది సేపటి తరువాత టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెల్లినప్పుడు ఆయా పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో ఇరు పార్టీల నాయకులు స్టేషన్ ఆవరణలోనే దాడులు చేసుకున్నారు. పోలీసులు వీరిని కంట్రోల్ చేసినా కూడా గొడవ సద్దుమణగలేదు. చివరకు కార్లపై కూడా రాళ్లతో దాడి చేసుకోవడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇల్లంతకుంట ఎస్సై ఉన్నతాధికారులకు ఫోన్లో ఈ విషయాన్ని వివరించారు.