న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యలో ట్విస్ట్
దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, నామగణి దంపతులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా కుంట శ్రీనివాస్, చిరంజీవిలను మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచెర్ల శివార్లలో నడి రోడ్డుపై వారిని నరికి చంపింది కుంట శ్రీనివాస్, చిరంజీవిలుగా గుర్తించిన పోలీసులు. చిరంజీవి కుంట శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడుగా ఉంటున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. గురు భక్తిని చాటుకోవడంలో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, నామగణి దంపతులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా కుంట శ్రీనివాస్, చిరంజీవిలను మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచెర్ల శివార్లలో నడి రోడ్డుపై వారిని నరికి చంపింది కుంట శ్రీనివాస్, చిరంజీవిలుగా గుర్తించిన పోలీసులు. చిరంజీవి కుంట శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడుగా ఉంటున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం.
గురు భక్తిని చాటుకోవడంలో భాగంగా, కుంట శ్రీనివాస్ కోసం వామన్ రావు దంపతులను చిరంజీవి నరికి చంపినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే వామన్ రావు తండ్రి కిషన్ రావు మాత్రం ఈ హత్యకు వెల్ది వసంత్ రావు, అక్కపాక కుమార్, కుంట శ్రీనివాస్‌లు పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఏ1గా వసంత్ రావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా కుమార్ పేర్లు నమోదు చేశారు. వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధం లేని వ్యక్తి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.