దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిపాలన విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏలు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీ ట్యాక్సులు వేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపార వేత్తలు రాహుల్ గాంధీకి వందలకోట్లు ఇవ్వాల్సిందే అని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సారి దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అని అన్నారు. తెలంగాణలోనూ తాము మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోటీ కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని అన్నారు.