బెంగాల్ గవర్నర్‌ను అడ్డుకోండి: ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

Update: 2024-03-22 17:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌‌ చేస్తున్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవాలంటూ అధికార టీఎంసీ, ఎన్నికల కమిషన్(ఈసీ)కు శుక్రవారం ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల సమస్యలు వినడానికి, పోలింగ్ టైంలో వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు గవర్నర్ ఆనంద ‘లోగ్‌సభ’ అనే కొత్త పోర్టల్‌ను ఈ నెల 18న ప్రారంభించారు. టీఎంసీ దీన్ని వ్యతిరేకిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ చర్యతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నారని, ఈసీ తరహాలో సమాంతర కార్యాలయాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ‘లోగ్‌సభ’ పోర్టల్.. ఈసీ అధికారాన్ని బలహీనరపర్చడమేకాకుండా, పోలింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి దారితీస్తుందని వెల్లడించింది. కాబట్టి, గవర్నర్ చట్టవిరుద్ధమైన చర్యలను అడ్డుకోవాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది.


Tags:    

Similar News