ప్రధాని మోడీ తాళి కట్టిన మహిళ దిక్కుతోచని స్థితిలో ఉంది.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ భార్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాంగళ్యం విలువ మోడీకి తెలియదని విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ భార్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాంగళ్యం విలువ మోడీకి తెలియదని విమర్శించారు. మంగళసూత్రం గురించి ప్రస్తావించి మహిళల్ని మోడీ అవమానించారని మండిపడ్డారు. మోడీ తాళికట్టిన వ్యక్తి ఇప్పుడు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నందుకు నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అసలు ప్రధాని మోడీకి దేశ చరిత్ర తెలియదని అన్నారు.
కాంగ్రెస్ పునాదులపై నిలబడి మోడీ మాట్లాడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లిం అంటూ ప్రధాని మోడీ మాట్లాడటం సిగ్గుచేటు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ ప్రధాని ఈ రేంజ్‌లో అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ పెద్దలకు నిద్ర కూడా పట్టడం లేదని విమర్శించారు. మేనిఫెస్టోపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ద్వేషాన్ని నింపుతూ మోడీ భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎంతకైనా తెగిస్తారా? అని ప్రశ్నించారు.