సోనియా గాంధీ పోటీ చేయకపోవడంపై ప్రధాని మోడీ సెటైర్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని సెటైర్ వేశారు.

Update: 2024-04-21 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని సెటైర్ వేశారు. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఆదివారం ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అయ్యారని విమర్శించారు. రాజ్యసభకు వెళ్లేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాజస్థాన్‌‌‌ను అడ్డాగా మార్చుకున్నారని అన్నారు.

గతంలో కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడు సోనియాగాంధీ కూడా రాజస్థాన్‌ను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆ పార్టీ 400 స్థానాలు గెలుచుకుందని, ఇప్పుడు మాత్రం అభ్యర్థుల్నే నిలబెట్టలేకపోతోందని ఎద్దేవా చేశారు. 400 మార్కుని ఈసారి ఎన్డీఏ అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.

Tags:    

Similar News