‘పెద్దన్నా పెద్దన్నా’ అని వెంటపడితే కుదరదు.. CM రేవంత్‌కు ప్రధాని మోడీ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పలువురు మీడియా ప్రతినిధులతో మోడీ చిట్ చాట్ నిర్వహించారు.

Update: 2024-05-02 15:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పలువురు మీడియా ప్రతినిధులతో మోడీ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల అనంతరం కేసీఆర్ నా వద్దకు వచ్చారు. ఎన్డీఏలో చేరాలనుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని నాతో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అపోజిషన్‌లో ఉండి కొట్లాడాం.. వచ్చే ఎన్నికల్లో కూడా విపక్షంగానే పోరాడుతాం అని కేసీఆర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఆయన దారి ఆయన చూసుకున్నారు’ అని ప్రధాని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై స్పందించారు.

అవినీతిలో కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వొచ్చు అని సెటైర్ వేశారు. తనను ‘పెద్దన్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి సంబోధించినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. పెద్దల నుంచి చిన్నవాళ్లు నేర్చుకోవాలి. తరచూ ‘పెద్దన్నా పెద్దన్నా’ అంటూ వెంటపడితే కుదరదు అని చురకలు అంటించారు. ప్రభుత్వం.. ప్రభుత్వమే - పర్సనల్.. పర్సనలే అని అన్నారు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలనేదే తమ సిద్ధాంతమని చెప్పారు. తమతో ఎవరు కలిసి వచ్చినా.. రాకున్నా తాము ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు విలువ ఇస్తామని అన్నారు. ఇంద పెద్ద దేశాన్ని నడిపించాలంటే అది అవసరం అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News