‘రాముడి పేరుతో ఓట్లు అడుక్కునే పార్టీ బీజేపీ’
బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాత్రి ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మంత్రి మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాత్రి ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మంత్రి మాట్లాడారు. రాముడి పేరుతో ఓట్లు అడుక్కునే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఆ పార్టీలో అభ్యర్థులు కరువయ్యే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయం చేసే వ్యక్తులం కాదని అన్నారు.
ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలతో ప్రజల్లో పూర్తి విశ్వాసం సంపాదించామని తెలిపారు. ఆ భరోసాతో పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 స్థానాలు సాధించి.. క్లీన్ స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని అన్నారు. పదేళ్ల పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని.. అయినా వాటన్నింటినీ అదిగమించి హామీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.