లోక్‌సభలో బహుజన గొంతు గెలవాలి: కేటీఆర్
వెనుకబడిన కులాల కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వెనుకబడిన కులాల కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు. 93 బీసీ కులాలను ఒక్క వేదికపైకి చేర్చి.. అరుదైన ఘనతను కాసాని సాధించారన్నారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి కాసాని ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్నారు. జ్ఞానేశ్వర్‌ని పార్లమెంట్‌కు పంపితే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు పోరాటం చేస్తారని, చేవెళ్ల సమస్యలపై గొంతెత్తుతారన్నారు. చేవెళ్లకు చిల్లి గవ్వ ఇవ్వని బీజేపీ పార్టీ ఒకవైపు, పదవుల కోసం పార్టీలు మారే నీతిలేని కాంగ్రెస్ అభ్యర్థి మరోవైపు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలకు గుణపాఠం చెప్పాలంటే బహుజన గొంతు కాసాని గెలవాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన బీఆర్ఎస్ పార్టీకే అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల ప్రజలు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆదరించాలని, ఎంపీగా గెలిపించుకుందాం అని పిలుపు నిచ్చారు.