రూ.150తో హైదరాబాద్‌కు వచ్చా.. CM అవుతానని కలలో కూడా ఊహించలేదు: రేవంత్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన వ్యక్తిగత విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన ముచ్చటించారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన వ్యక్తిగత విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన ముచ్చటించారు. జేబులో రూ.150 పెట్టుకొని హైదరాబాద్‌కు వచ్చానని.. ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అనతి కాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నా.. ఇక కేసీఆర్ వద్ద లాక్కోవడానికి కూడా ఏం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం పోటీ పడితే స్వాగతిస్తా. నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తా. కాంగ్రెస్‌లో ఎవరూ ప్రత్యర్థులు లేరు. అందరూ నాకు సహచరులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవం ఇస్తున్నారు.. తాను తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దోడ్నికాబట్టి తాను కూడా ఎవరినీ బాధపెట్టేలా మాట్లాడను అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని అన్నారు. కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని తెలిపారు. నేనైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నాను అని వెల్లడించారు.