మరో లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేగం పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేగం పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ఇవాళ మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఫైనల్ చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
కాగా, 2019 ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరపున మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. బీఎస్పీతో పొత్తు ఖరారు కావడంతో ఆ పార్టీకి నాగర్ కర్నూలు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.