నేతలు నచ్చకపోతె నోటా.. అసలు ఎన్నికల ప్రక్రియ నచ్చకపోతే..? బహిష్కరించ వచ్చు ఎలానో తెలుసా..?

సాధారణంగా మనకి రాజకీయ నేతలు ఎవరూ నచ్చనప్పుడు మనం నోటాకు ఓటేసి రాజకీయ నేతల పట్ల ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తుంటాము.

Update: 2024-05-13 09:56 GMT

దిశ వెబ్ డెస్క్: సాధారణంగా మనకి రాజకీయ నేతలు ఎవరూ నచ్చనప్పుడు మనం నోటాకు ఓటేసి రాజకీయ నేతల పట్ల ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తుంటాము. మరి అసలు ఎన్నికల ప్రక్రియ నచ్చకపోతే..? ఎన్నికలను బహిష్కరించ వచ్చా..? అంటే బహిష్కరించ వచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాగైతే మనకు రాజకీయ నేతలు నచ్చకపోతే నోటాకు ఓటేసి వ్యతిరేకతను వ్యక్తపరుస్తామో, అలానే ఎన్నికల ప్రక్రియ నచ్చకపోతే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి రిఫ్యూజ్ టు ఓట్ అనే హక్కు కూడా ప్రజలకు ఉంది.

ఎన్నికలను బహిష్కరించాలి అని అనుకుంటే.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. అనంతరం ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఐడి రిజిస్టర్ చేసుకున్న తరువాత ఓటు వెయ్యకుండా బహిష్కరించవచ్చు. ఒక నేత మనకు నచ్చలేదు అని చెప్పేందుకు మనకు నోటా ఉంటే ఎన్నికల ప్రక్రియ నచ్చలేదు అని చెప్పడానికి రిఫ్యూజ్ టు ఓట్ అవకాశం కల్పిస్తోంది.  


Similar News