పంతం నెగ్గించుకున్న జగదీశ్ రెడ్డి.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న గుత్తా అమిత్ రెడ్డి!
ఎంపీ ఎన్నికల బరిలో నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తప్పుకున్నట్లు తెలుస్తోది. అమిత్ రెడ్డి గత మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.
దిశ, నల్లగొండ బ్యూరో: ఎంపీ ఎన్నికల బరిలో నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తప్పుకున్నట్లు తెలుస్తోది. అమిత్ రెడ్డి గత మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అప్పుడు టికెట్‌ను అదిష్టానం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేటాయించింది. రానున్న ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించారు. ఈ విషయాన్ని పలుమార్లు గుత్తా సుఖేందర్ రెడ్డి పలు మార్లు వెల్లడించారు. భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు.
మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో..
అమిత్ రెడ్డి మొదట నల్గొండ పార్లమెంట్ ఆశించారు. అయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సైతం అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీంతో నల్గొండ నుంచి టిక్కెట్ కష్టమని భావించారు.
భువనగిరి నుంచి ఆశించి..
అయితే నల్గొండ నుంచి టికెట్ కష్టమనే నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నుంచి టికెట్ ఆశించారు. ఇదే విషయాన్ని సుఖేందర్ రెడ్డి సైతం వెల్లడించారు. అయితే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకించారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేసినట్లు, దీనికోసమే వీరంతా అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గుత్తాకు మొదటి నుంచి రాజకీయంగా వైరం ఉండడంతో అమిత్ రెడ్డి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుత్తాపై పై చేయి సాధించినట్లేనని చర్చ జరుగుతోంది.