కట్టే కాలే వరకు కేసీఆర్ వెంటే ఉంటా.. మాజీ మంత్రి కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటాలని చూస్తోంది.

Update: 2024-04-06 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రచారంలోనూ వినూత్న పంథా అవలంభిస్తున్నారు. ఈ క్రమంలో మరోవైపు కీలక నేతలంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది బీఆర్ఎస్‌ను వీడటానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు విస్తృతమయ్యాయి.

ఈ జాబితాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా పార్టీ మార్పుపై ఆమె స్పందించారు. కేసీఆర్ కష్టకాలంలో ఉంటే కొందరు స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు. ఎన్నికల్లో ఓడిన నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘అలాంటి గొప్ప వ్యక్తి మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా యాత్ర చేశాను.. కేసీఆర్ పేరు పచ్చబొట్టు కూడా వేయించుకున్నాను. అలాంటి నేనెందుకు పార్టీ మారుతాను. కట్టే కాలే వరకు కేసీఆర్ వెంటే ఉంటా’ అని సత్యవతి రాథోడ్ ప్రకటించారు.

Tags:    

Similar News