స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.. ఎన్నికల అధికారి
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ ఎం హరినారాయణన్ సూచించారు.
దిశ,ప్రతినిధి నెల్లూరు: ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ ఎం హరినారాయణన్ సూచించారు. గురువారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించేందకు వచ్చిన కలెక్టర్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన రిజిష్టరులో సంతకం చేసి, పోలీసు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు.
కౌంటింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని పరిశీలించారు. ఈ గ్యాలరీలో రాజకీయపార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియను వీక్షించేందుకు సీసీ టీవీలను ఏర్పాటుచేశారు. అలాగే 8 నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను మానిటరింగ్ చేసేందుకు మూడు షిప్టుల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.