postal ballot votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా..?

ఎన్నికల విదుల్లో ఉన్న వాళ్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తారు అనే విషయం అందరికి తెలిసిందే.

Update: 2024-05-28 07:32 GMT

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల విదుల్లో ఉన్న వాళ్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా..? మొదటగా సీల్ చేసినా బ్యాలెట్‌ను ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయగానే అందులో డిక్లరేషన్ ఉండాలి. ఏకారణాలచేతనైనా డిక్లరేషన్ లేకపోతే ఆ ఓటు వ్యాలిడ్ ఓటుగా పరిగణించబడదు.

ఆ తరువాత బ్యాలెట్ కవర్ను చూస్తారు. బ్యాలెట్ కవర్కు సీల్ లేకున్నా ఓటు లెక్కలోకి రాదు. అలానే డిక్లరేషన్ పై ఉన్న నెంబర్ బ్యాలెట్ పేపర్‌పై ఉన్న నెంబర్లు సరిపోవాలి. డిక్లరేషన్‌పై ఎలక్టర్ సిగ్నేచర్, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, హోదా ఉంటేనే బ్యాలెట్‌ను లెక్కలోకి తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. 


Similar News