ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది.

Update: 2024-03-14 14:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది. గురువారం బాండ్ల వివరాలను https://www.eci.gov.in/candidate-politicalparty అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది. మొత్తం 763 పేజీలలో వివరాలు వెల్లడించింది. అంతేకాదు.. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పాదర్శకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు 2019 నుంచి 2024 వ‌ర‌కు సుమారు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసిన‌ట్లు SBI తెలిపింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బాండ్ల డేటాను పెన్‌డ్రైవ్‌లో స‌మ‌ర్పించిన‌ట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్షన్‌తో కూడా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అయితే మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News