తెలంగాణలో మా మద్దతు వారికే.. CPIM నేత తమ్మినేని ప్రకటన

సీపీఐఎం నేత తమ్మినేని వీరభద్రంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐఎం మద్దతు మాకే ఉంటుందని అని భావిస్తున్నట్లు తెలిపారు.

Update: 2024-04-19 16:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐఎం నేత తమ్మినేని వీరభద్రంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐఎం మద్దతు మాకే ఉంటుందని అని భావిస్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలో సీపీఎం మిత్రపక్షంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేయాలని భావించాం. కానీ, వారు అడిగిన సీట్లు ఇవ్వలేకపోయాం. భవిష్యత్‌లో మా వంతు సహాయ సహకారాలు సీపీఐఎంకు ఉంటాయని భట్టి భరోసా ఇచ్చారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కలిసొచ్చే పార్టీలకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. తాము పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News