ఇక నేను పెళ్లి చేసుకునే టైమొచ్చింది.. ఎట్టకేలకు రాహుల్ గాంధీ క్లారిటీ (వీడియో)

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

Update: 2024-05-13 13:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాయ్‌బరేలీలో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు’ అని నవ్వి అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. చివర్లో చేసిన ఆ కామెంట్‌ విన్న ప్రియాంక గాంధీ సైతం నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘హమ్మయ్య ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ చేయడమే తొలి కర్తవ్యమని అన్నారు. రైతులకు చట్టపరమైన మద్దతు ధర తీసుకురావడం రెండో పని. మూడో టాస్క్‌ను వివరిస్తూ.. రైతులకు బీమా సొమ్మును 30 రోజుల్లోగా చెల్లించడం మూడో పని అని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలితో కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News