మహబూబ్‌నగర్ ఎంపీ సీటు లాస్.. CM రేవంత్ రియాక్షన్ ఇదే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు.

Update: 2024-06-05 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. తాజాగా.. మహబూబ్‌నగర్ ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదు రాష్ట్రానికి అని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలుపు ఓటములకు తానే బాధ్యుడిని అని చెప్పారు. ముఖ్యంగా సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఫలితానికి తానే బాధ్యత వహిస్తారని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఉగాధి పండుగ లాంటివని అభిప్రాయపడ్డారు.

తాను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని అని.. నా బాధ్యత రాష్ట్రం మొత్తం ఉంటుందని అన్నారు. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నారు. కుట్ర పూరితంగా మెదక్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీసీ బిడ్డను ఓడించారని ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ను గెలవనీయవద్దని తనని తాను బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని తెలిపారు. 22 శాతం ఉన్న బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని అన్నారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు. కేవలం కాంగ్రెస్‌ను గెలవనీయవద్దనే హరీష్ రావు కుట్రపూరితంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని అన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ 16.5 శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీకి తాకట్టుపెట్టారని మండిపడ్డారు.


Similar News