బీఆర్ఎస్ మరో లోక్‌సభ అభ్యర్థి ఖరారు.. ఏకగ్రీవంగా తీర్మానించిన నేతలు!

స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘంగా పాలించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Update: 2024-03-04 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘంగా పాలించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ కాలుజారి పడిపోవడం, వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తుండటం క్షేత్రస్థాయిలో నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పరిస్థితి పూర్తిగా చేజారకముందే కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు.


పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో తెలంగాణ భవన్ వేదికగా భేటీ అయ్యారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలైన నామా నాగేశ్వరరావు, మాలోతు కవితలకు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా ఇప్పటికే నామా నాగేశ్వర రావు పేరు ప్రకటించడగా.. మహబూబాబాద్ అభ్యర్థి అయిన మాలోతు కవిత పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News